ప్రస్తుతం తాగుబోతుల కష్టాలు అన్ని ఇన్నికావు.. కరోనా వైరస్‌తో ప్రజలంతా కట్టడి అయితే, మందుబాబుల నోళ్లు కూడా మందుచుక్క లేక చప్పబడిపోయి విలవిలలాడుతుందట.. ఇప్పటికే ఎర్రగడ్డ హస్పిటల్‌కు ఈ బాబులంతా క్యూ కడుతుండగా, మరికొందరు ముప్పతిప్పలుపడి ఏదోలా ఒక చుక్క సాంపాదించుకుంటున్నారట.. ఇదిలా ఉండగా ఏళ్లతరబడి పాతపడని పదం ఏదన్నా ఉందంటే అది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే పదం అని చెప్పవచ్చు.. ఇక ఏదైనా అతి అన్ని అనర్ధాలకు మూలం అన్న విషయం తెలిసిందే.. కానీ మద్యాన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

 

ఇకపోతే మన దేశంలో చాలా మంది రోజంతా కష్టపడి.. సాయంత్రం కాగాగే మద్యం బాటిల్‌ ఎత్తేస్తారు. ఆ రోజు సంపాదించిన కొద్ది మొత్తాన్ని తాగడానికే ఖర్చు పెడతారు. ఇలా రోజు తాగుతూ తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ.. జీవితకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బార్‌లు, వైన్‌షాపులు మూసివేశారు. దీంతో గత కొన్ని రోజులుగా మందుబాబులు ఇంటికి పరిమితమయ్యి, మద్యానికి దూరమయ్యారు.. ఇక ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల్లో మద్యం తాగడం మానేయడం వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.

 

 

అందులో ఒక నెల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయట.. అవేంటో తెలుసుకుంటే. ప్రతి వారి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం లివర్‌.. ఇది కాస్త చెడిపోతే శరీరంలో ఉన్న చాలా భాగాలు సరిగా పని చేయవు. ఇక మద్యం విపరీతంగా తీసుకునే వారిలో ఖచ్చితంగా లివర్‌ డ్యామేజ్ అవుతుంద్ట. అదే ఒక నెల పాటు మద్యం మానేసిన.. మన లివర్‌ తిరిగి మెరుగువుతుంది. అదీగాక మద్యం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇది గుండెకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండగా, బ్లడ్‌ సర్క్యలేషన్‌ కూడా ఆగిపోయి.. గుండె పోటు వంటివి వచ్చే అవకాశం ఉందట.. అందువల్ల మద్యం మానేస్తే.. శరీరంలోని కొవ్వులు పూర్తిగా కరిగిపోయి, గుండెకు రక్త సరఫరా సరైన పద్దతితో సాగుతుంది.

 

 

ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు గుండెను కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. ఇంతే కాకుండా మితిమీరి మందు తాగితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. అందులో లివర్‌, బ్రెస్ట్‌, కొలొరెక్టర్‌ క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. అయితే మద్యం తాగడం మానేస్తే.. దీని నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. అదీగాక కొందరు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.. అందువల్ల ఓ నెల పాటు మద్యాన్ని మానేస్తే.. ఖచ్చితంగా బరువు తగ్గడంతో పాటుగా, బ్రెయిన్‌ కూడా చాలా షార్ప్‌గా పని చేస్తుందని డాక్టర్లు పేర్కొంటున్నారు.. అయినా ఎన్ని చెప్పిన తాగుబోతుల చెవులకు ఇవి ఎక్కవు అని అంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: