జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రజల కోసం పని చేస్తున్న తీరు జాతీయస్థాయిలో అందరిని ఆకట్టుకుంటుంది. గత సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినా గాని ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బాధ్యతగల పౌరుడిగా రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 21 రోజులపాటు ‘లాక్‌ డౌన్‌’ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన తెలుగువారి యోగక్షేమాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఇంటిలోనే ఉంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. వర్క్ ఫ్రం హోం పేరిట పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఇది అసలైన పొలిటిషన్ చేసేది అంటూ తెగ పొగుడుతున్నారు.

 

ప్రజలు ఓట్లు వేయలేదు పార్టీని గెలిపించ లేదు అన్న విషయాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ మానవత్వంతో ప్రజలకు ఈ విధంగా సాయం అందించడానికి బాధ్యతగా మెలగటం తో చాలామంది రాజకీయ నేతలు పవన్ చేసిన ఈ పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాలు ఉన్న ప్రభుత్వాలతో మంతనాలు జరుపుతూ చొరవ తీసుకుని ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.

 

దీంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పనికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు వారు పడుతున్న అవస్థలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయటంతో ఆ రెండు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో ఇంట్లో ఉంటూ పవన్ చేస్తున్న ఈ పనికి జగన్ అయినా శభాష్ అనాల్సిందే  అని నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్ పెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: