దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకూ 1637 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 38 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల రోజురోజుకు బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9 లక్షలకు చేరగా మృతుల నలభై వేల మంది మృతి చెందారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు కనిపెట్టగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. చైనా ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు త్వరలోనే వెలువడుతాయని చైనా చెబుతోంది. అమెరికాతో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సెప్టెంబర్ లోపు వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ క్రమంలో మన దేశంలో కూడా వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగే వారిని కూడా క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. 
 
కాంట్రాక్ట్ ట్రేసింగ్ లను ఏర్పాటు చేసి కరోనా ధికంగా వ్యాపించిన ప్రాంతాలలో ఇతరులకు వైరస్ సోకకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కరోనాను దేశం నుంచి తరిమేందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ నాలుగు రోజుల క్రితం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశారు. ఆయన వ్యాక్సిన్ ను టెస్టింగ్ కు కూడా పంపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: