ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బాధితులను రక్షించేందుకు మందు కనిపెట్టినట్లు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె ప్రకటించారు. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడానికి రెడీగా భూమిమీద విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ నీ అరికట్టడానికి సార్స్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన ‘యాంటీ బాడీస్‌’నే తమ బృందం ఉపయోగించి కరోనా వైరస్ కి మందు కనిపెట్టడం లో విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’ ల్యాబ్‌కు సీఈవోగా డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె వ్యవహరిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో ఐదు యాంటీ బాడీస్‌ను తీసుకుని లోతుగా పరీక్షలు జరిపి చెప్పుకొచ్చారు. చేసిన ప్రయత్నాలలో సార్స్‌ను నిర్వీర్యంచేసే యాంటీ బాడీస్‌తోనే తమ ప్రయోగం ఫలించిందని పాండిమిక్‌ నెట్‌ఫ్లిక్స్‌ తీసిన డాక్యుమెంటరీలో కనిపించిన డాక్టర్‌ జాకబ్‌ వివరించారు.

 

కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ఎస్‌–ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ఉపయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌–ప్రొటీన్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నాశనం చేసిందని డాక్టర్‌ జాకబ్‌ తెలిపారు. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుని పాల తొందరలోనే మందు అందుబాటులోకి తీసుకువస్తామని అంతా ఓకే అయితే సెప్టెంబర్ నెలలోనే మందు రావొచ్చని డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె చెప్పారు. అందుబాటులో ఉన్న మందును మరో రెండు లేబరేటరీ లలో క్షుణ్నంగా పరిశీలించి ఫలితాలను నిర్ధారించుకుని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ అమెరికా దేశంలో చాలా వైరల్ గా మారింది.

 

డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె ఉద్యోగాలు అంతా ఓకే అయితే కనుక ప్రపంచ మానవాళిని డేంజర్ జోన్లోకి పడవేసిన కరోనా వైరస్ పీడ విరిగిపోయిన అట్లే అంటూ అమెరికా జాతీయ మీడియా వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. మరోపక్క ఈ ఏడాదిలోనే అమెరికా ఎలక్షన్లు జరగబోతున్న తరుణంలో మందు ముందే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని మరి కొంతమంది అంటున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు హామ్మయ్య వ్యాక్సిన్ కనుక్కో పోయినా గాని, మందు కనుక్కున్నారు కంగ్రాట్స్ అమెరికా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: