కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షలకు దగ్గరలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కాబోతుంది. ముఖ్యంగా అమెరికా మరియు యూరప్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. అగ్రరాజ్యం అమెరికా లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారి పైనే బాగా ప్రభావం చూపుతుందని ఇటీవల వార్తలు రావడం జరిగాయి. యువతపై మరియు పిల్లలపై అంతగా ఎక్కువగా వైరస్ ప్రభావం ఉండదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇటలీలో భారీ సంఖ్యలో జనాలు చనిపోవడానికి కారణం అక్కడ 60 సంవత్సరాలకు పైగానే ఉన్నవారికి ఈ వైరస్ సోకటం జరిగిందని అందువల్లే వారు చనిపోవడం జరిగిందని చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా ఈ వైరస్ వల్ల ఇటీవల బ్రిటన్ దేశంలో 13 సంవత్సరాల బాలుడు మృతి చెందడం జరిగింది. దీంతో బ్రిటన్ దేశంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం బాలుడికి కరోనా లక్షణాలు కనపడడంతో లండన్ లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్య అందిస్తున్నారు. ఆ బాలుడికి ఊపిరితీసుకోవడం కాస్త ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ పై ఉంచి శ్వాస అందించారు.

 

ఈ తరుణంలో బాలుడు కోమాలోకి వెళ్లి కొన్ని గంటల తరువాత మృతి చెందినట్లు అక్కడ డాక్టర్లు తెలియచేసారు. 13 ఏళ్ల వయస్సు కలిగిన బాలుడు చనిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతేకాకుండా బ్రిటన్ దేశంలో అతి చిన్న వయసులో చనిపోయిన వ్యక్తి ఇతనే అని ఆ మీడియా చానల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో అంత చిన్న వయసు వాడే చనిపోయాడు అంటే .. మనం ఎంత అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ దేశం లో  కరోనా భారిన పడిన వారి సంఖ్య 25150 కి చేరుకోగా, మృతులు సంఖ్య 1789 కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: