దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మూడవ దశకు చేరుకుంటున్న ప్రస్తుత సమయం లో వైద్య సిబ్బంది అందించే సేవలు వెలకట్టలేనివి . తమ ప్రాణాలకు ముప్పని తెలిసి కూడా  రోగులకు వైద్య సిబ్బంది,  వైద్య సేవల్ని అందిస్తున్నారు . అదే సమయం లో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పురస్కరించి కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు విధుల్లోకి రాకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు . ఇక కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు శానిటేషన్ సిబ్బంది సైతం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు .

 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో  వీరు చేస్తున్న సేవలు , దేశ సరిహద్దుల్లో సైనికులు చేస్తోన్న సేవల వంటివేనని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు . గతంలో యుద్ధం లో ఎవరైన సైనికుడు మరణిస్తే వారి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధికసహాయం అందచేయాలని నిర్ణయించింది . అయితే కరోనా కట్టడి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న వైద్యులు , వైద్య సిబ్బంది , శానిటేషన్ సిబ్బందిలో ఎవరైన మరణిస్తే , వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించి , వారికి ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నాన్ని చేశారు .

 

అయితే ఇప్పటి వరకు వైద్యులు , వైద్య , శానిటేషన్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల బీమా ప్రకటించిన విషయం తెల్సిందే . ఈ విపత్కర పరిస్థితుల్లో  అత్యవసర సేవలందిస్తోన్న వారికి అండగా ఉన్నామన్న సంకేతాల్ని కేంద్రం పంపగా , ఢిల్లీ ముఖ్యమంత్రి మరొక అడుగు ముందుకేసి తమ వంతుగా చేసిన ప్రకటన , దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్ఫూర్తినిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని   రాజకీయ పరిశీలకులు విశేషిస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: