'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేయడం జరిగింది. బాహుబలి రేంజ్ లో నే విజయం సాధించాలని యాక్షన్ స్టోరీ కలిగిన సాహో సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోనుంది. తీరా సినిమా రిలీజయ్యాక మొదటి షో కి అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహం చెందారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పూర్తి ప్రేమ కథా చిత్రం ప్రభాస్ ఒకటి చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. కాగా కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పరిస్థితి రాకముందే జార్జియాలో సినిమాకి సంబంధించి షూటింగ్ అక్కడ జరుపుకొంది.

 

కానీ కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులన్నీ మారిపోవడంతో ప్రభాస్ కొత్త సినిమా యూనిట్ అంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఎందుకంటే సినిమాకి సంబంధించి అత్యంత కీలకమైన హాస్పిటల్ సీన్ జార్జియాలో కొద్దిగా తీయాల్సిన బ్యాలెన్స్ ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఇతర దేశస్థులు మరియు విమాన రాకపోకలు ఒక దేశం నుండి మరొక దేశానికి ఆగి పోవడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో అత్యంత కీలకమైన ఆ సీన్ విషయంలో జార్జియా వెళ్లి చేయకపోయినా పర్లేదు గాని సేమ్ అదే హాస్పిటల్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఏపించండి సినిమాకి అదే హైలెట్ సీన్ అంటూ నిర్మాతలతో ప్రభాస్ పంతం పట్టాడట. దీంతో లాక్ డౌన్ కేంద్రం తీసివేసిన వెంటనే అలాంటి సెట్ యువి మరియు గోపికృష్ణ నిర్మాణ సంస్థకు చెందిన వాళ్లు అన్నపూర్ణ స్టూడియోలో వెయ్యటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా లేట్ అయింది ఇంక దేని గురించి ఆలోచించొద్దు అంటూ ఈ విషయంలో నిర్మాతలతో ప్రభాస్ పంతం పట్టడంతో అదే రేంజ్ లో జార్జియాలో ఉండే విధంగానే సెట్ వేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: