ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ పాజిటివ్ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అంతకు ముందు వరకు విదేశాల నుండి వచ్చిన వాళ్ళ నుండి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు దేశవ్యాప్తంగా గుర్తించడంతో విదేశీయులను గుర్తించడంలో ఏపీ సర్కార్ మొదటి దశలోనే సక్సెస్ సాధించింది. దాంతో ఆ టైంలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీలో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వ పని తీరుపై అభినందనలు దేశవ్యాప్తంగా వచ్చాయి. ఇటువంటి కీలక టైంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో ఏపీలో ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో నమోదయ్యాయి.

 

ఒక్క బుధవారం సాయంత్రం లోనే దాదాపు ఇరవై నాలుగు కేసులు వరకు నమోదయ్యాయి. ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 111కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది. దీంతో ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో రావడంతో ఏపీ ప్రజలు బాబోయ్ అని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను తమ అరచేతిలో పెట్టుకొని ఇళ్లల్లో బతుకుతున్నారు.

 

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు

గుంటూరు - 20

కృష్ణా- 15

వైఎస్సార్‌- 15 

ప్రకాశం- 15

పశ్చిమ గోదావరి- 14

విశాఖపట్నం- 11

తూర్పు గోదావరి- 9

చిత్తూరు- 6 

నెల్లూరు- 3

అనంతపురం- 2

కర్నూలు- 1



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple




మరింత సమాచారం తెలుసుకోండి: