సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో 'మీటూ', 'కాస్టింగ్ కౌచ్' లాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా సినీ ఆర్టిస్టులపై వేధింపులు మాత్రం ఆగేలా లేవు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బహిరంగంగా చెప్పారు. కొందరైతే దర్శక నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆఖరికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌కు కూడా వేధింపులు తప్పలేదని తెలియవచ్చింది. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో పేరు మోసిన డైరెక్టర్ ఒకరు సినిమా అవకాశం కోసం వచ్చిన ఒక హీరోయిన్ ని కమిట్మెంట్ అడిగాడట. ఒక నైట్ తనతో పడుకుంటే తను దర్శకత్వం వహించబోయే ఒక పెద్ద ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకుంటానని అన్నాడట. అంత పెద్ద డైరెక్టర్ అలాంటి మాటలు మాట్లాడేసరికి షాక్ తిన్న ఆ హీరోయిన్ అక్కడి నుండి అవీ ఇవీ మాటలు చెప్పి అక్కడి నుండి బయటపడిందంట. ఈ విషయం తన దగ్గర వాళ్ళకి చెప్పుకొని బాధ పడిందట.

అయితే కొందరు నటీమణులు దర్శకులు, నిర్మాతలు వెకిలి వేషాలు వేసినా లైట్ తీసుకుని, ఎందుకులే గొడవ అన్నట్లు వదిలేస్తుంటారు. మరికొందరు డైరెక్టుగా వున్నది వున్నట్లు బహిరంగంగా చెప్పేస్తారు. ఈ హీరోయిన్ మొదటి కేటగిరీనే ఎంచుకుంది. ఈ విషయం విన్న సినీ ఇండస్ట్రీలోని కొందరు ఇది కొత్త విషయమేమీ కాదని, ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారమని లైట్ తీసుకుంటున్నారంట. ఏది ఏమైనా మీటూ లాంటి ఎన్ని ఉద్యమాలు జరిగినా మనుషుల్లో మార్పు రానంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: