ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని వణికిస్తున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన ముస్లింల మీటింగ్ గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. తబ్లిజి జమాత్ లో దేశం నలుమూలల నుంచే కాకుండా అంతర్జాతీయగా ముస్లింలు వేలాది సంఖ్యలో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. వారిలో విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా కరోనా వైరస్ వ్యాపించింది అన్న విషయం కూడా విదితమే. దీంతో ఈ ఒక్కరోజే భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 400 కు పైగా పెరిగింది. దేశంలో దాదాపు 2012 మందికి కరుణ వైరస్ సోకినట్లు కేంద్రం లెక్కలు వివరించింది.

 

అయితే మార్చి 13 వ తేదీన మొదలైన ఈ మీటింగ్ లు జరిగే సమయానికి మన దేశంలో దాదాపు 85 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రార్థనలకు విదేశాల నుండి కూడా ముస్లింలు వస్తుందన్న విషయం కూడా కేంద్రంకు తెలిసిందే. దేశ రాజధాని లో కొన్ని వేల మంది ఒకే చోట విదేశీయులతో కలిసి ప్రార్థనలు చేయడం ఎంత ప్రమాదకరమో కేంద్రానికి తెలియని విషయం అయితే అసలు కాదు.

 

మరి ఇంత తెలిసిన భారత ప్రభుత్వం ఆ తబ్లికి జమాత్ కు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అ వచ్చిన చిక్కు ఏమిటంటే మార్చి 13 నుండి 15 తేదీల మధ్య ఈ ప్రార్థనలు జరగ్గా ఆ సమయానికి భారతదేశంలో లాక్ డౌన్ ఏదీ ప్రకటించలేదు. కనీసం ఒక్క మాట కూడా ఆ మీటింగ్ మొదలయ్యే సమయానికి ఎత్తలేదు.

 

ముందే బిజెపి వాళ్లు ముస్లింలకు వ్యతిరేకం అన్న ప్రచారం భారతదేశంలో చాలా జోరుగా సాగుతోంది. ఇటువంటి సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర కలిగిన ఈ మీటింగ్ కు అడ్డు చెబితే తమపై చాలా వ్యతిరేక భావం పెరిగిపోతుందని.... ఇక దేశంలో ఏ ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండడని ప్రభుత్వం భావించింది అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్రం రాజకీయపరంగా ఆలోచించిన కారణంగానే ఇప్పుడు కొన్ని వందల మంది చావులు చూడాల్సి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: