కరోనా వైరస్ ప్రపంచంలో సామాన్య ప్రజలతో పాటు దేశ ప్రధానులను కూడా విపరీతంగా వణికిస్తోంది. ఈ మహమ్మారి పేద, ధనిక, చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా తన అడ్డా లోకి వచ్చిన ప్రతి ఒక్కరి లోనికి ప్రవేశించి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. తన ముందు ఉన్నది దేశ ప్రధాని అయినా సరే ఎవరినీ వదిలిపెట్టదు. అంతేకాకుండా ఈ వైరస్ ఇప్పటికే చాలా మంది దేశ ప్రధానులకి సోకిన విషయం తెలిసిందే.

 

అంతేకాకుండా హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్, ఇడ్రిస్ ఎల్బా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మరియు ఎంతోమంది అంతర్జాతీయ ప్రముఖులకు ఈ కరోనా వైరస్ సోకింది. అలాగే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సలహాదారుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే ప్రధాని అలెర్ట్ అయిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయాడు. ఇక బ్రిటిష్ ప్రధాని మరియు అతని వైద్య శాఖా మంత్రి కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.

 

ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కి కూడా కరోనా పాజిటివ్ రావాల్సి ఉండగా ఆయన ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవడంతో దాని నుండి బయటపడ్డారు. లేకపోతే ఆయనకి కూడా పాజిటివ్ వచ్చేది అని వార్తలు వినపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే  మాస్కోలోని ప్రత్యేక కరోనా ఆసుపత్రి చీఫ్‌గా పనిచేస్తున్న డెనిస్‌ ప్రాట్సెంకొ గత మంగళవారం పుతిన్‌ కొమునార్క ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పుతిన్‌తో పాటు ఉన్నారు. ఆ డాక్టర్‌కు కరోనా సోకినట్లుగా ఇప్పుడు సమాచారం వచ్చింది. కాగా హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో పుతిన్‌ హజ్మత్‌ సూట్‌ను ధరించి ఉన్నారు. పుతిన్‌కు ఆరోగ్య పరీక్షలు జరిగాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: