కరోనా కట్టడి విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీన్ని కట్టడి చేయడానికి గాను కేసీఆర్ ముందు నుంచి కూడా కాస్త వేగంగానే ఆలోచించడం మొదలుపెట్టారు. కరోనా తీవ్రత విషయంలో ముందు కాస్త అటు ఇటు గా మాట్లాడినా సరే ఆ తర్వాత ఆయనకు సినిమా దాదాపుగా అర్ధమైంది. అందుకే ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా అందరికి నచ్చుతున్నాయి. 

 

ఇప్పుడు ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు కేంద్ర౦ సహకారం తీసుకోవడమే కాకుండా తెలంగాణకు ప్రత్యేక విదేశీ వైద్య బృందాలను కేంద్రం అనుమతితో తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతుంది. క్యూబా నుంచి వైద్యులను, స్వీడన్ నుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. 

 

కరోనా కట్టడి కావడానికి ఇప్పుడు దీన్ని మించిన మార్గం లేదని కేసులను కట్టడి చేయాలి అంటే మాత్రం ఇప్పుడు ఇంకా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడమే మార్గం అని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వం తో కూడా చర్చలు జరిపారని అంటున్నారు. అటు కేంద్రం కూడా ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని భావిస్తుంది. దీనిపై ఇప్పటికే విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: