తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 30 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్ మర్కజ్ సదస్సుకు హాజరై వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 127కు చేరింది. 
 
నిన్న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి గాంధీలో ఇద్దరు, యశోదాలో ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 9కు చేరింది. నిన్న చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రగతిభవన్ లో నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. 
 
సోమవారం రోజు మరణించిన ఆరుగురిలో ఐదుగురు మర్కజ్ వెళ్లి వచ్చినవారే అని సమాచారం. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగానే ఉందని... ఆందోళనకరంగా ఎవరి పరిస్థితి లేదని ప్రభుత్వం చెబుతోంది. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
పరీక్షల అనంతరం ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే ప్రభుత్వం వారి ప్రాణాలు కాపేడేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రజల సహకారం కూడా అవసరమని కేసీఆర్ చెప్పారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహాయసహకారాలు అందిస్తే రాష్ట్రంలో కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: