క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌పంచ‌దేశాల్లో విజృంభిస్తూ.. ప్ర‌జ‌ల‌ను అత‌లా కుత‌లం చేస్తుంది. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. మొదట చైనాను తీవ్ర స్థాయిలో వ‌ణికించిన‌ ఈ మహమ్మారి ఇప్పుడు దేశ‌దేశాల్లో విళ‌య తాండ‌వం చేస్తోంది. ఇక క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే అంద‌రూ దృష్టి పెట్టారు. అయితే ఇటు తెలంగాణ‌లో సైతం క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. బుధ‌వారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదు అవ్వ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌ణ‌కు గుర‌వుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ‌లో మ‌రొక‌రి ప్రాణాల‌ను బ‌లితీసుకుంది క‌రోనా.

 

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఒకరు మృతి చెందినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. అయితే దీంతో అక్క‌డ ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త నెల‌కొంది. రోగి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిన తర్వాత అదే వార్డులో చికిత్స పొందుతున్న అతని సోద‌రుడు వైద్యులపై దాడి చేశాడు. దాదాపు రెండుగంటల పాటు కరోనా వార్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రాణాలను పణంగాపెట్టి కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తుంటే.. ఇలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. 

 

ఈ క్ర‌మంలోనే విష‌యం తెలుసుకున్న హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ స్వ‌యంగా రంగంలోకి దిగి జూడాల‌కు స‌ర్ది చెప్పి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంత‌రం  దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు కూడా  కరోనా వైర‌స్ సోకిన వ్యక్తి కావటంతో నిందితుణ్ని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. మ‌రోవైపు గాంధీ ఆస్పత్రి డాక్టర్లపై జరిగిన దాడిని మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ‌లో మృతుల సంఖ్య 9కు చేరింది. 14 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: