తెలంగాణాలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది. కరోనా వైరస్ ని అక్కడి ప్రభుత్వం ముందు కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా చూస్తుంది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడ ఒక్క రోజే 30 కేసులు పెరగడంతో ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కరోనా వైరస్ విస్తరించడంతో ఇప్పుడు ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వ౦ చాలా వరకు సీరియస్ గానే ఉంది. 

 

ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళు బయటకు రాకపోతే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. మాట వినకపోతే మాత్రం చట్టాలను ప్రయోగించాలని అవసరం అయితే రాష్ట్రపతి అనుమతి తీసుకుని అయినా సరే కరోనా కట్టడి విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. కరోనా కేసులు ఇప్పుడు తెలంగాణలో 127 మందికి బయటపడింది. 

 

కేసీఆర్ నమ్మకం ప్రకారం చూస్తే అక్కడ కరోనా ఈ నెల 7 తో పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంది. కాని ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి. రోజు రోజుకి కేసులు పెరగడంతో కేసీఆర్ కూడా కాస్త అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినా సరే కొందరు చేసిన పనితో తెలంగాణా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఇక ఉపేక్షించేది లేదని బయటకు రాకపోతే మాత్రం ఇక చట్టాలను ప్రయోగించాలని ఆయన భావిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: