కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరైనా ఇల్లు దాటి వస్తే పోలీసులు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. దీంతో ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా తెలంగాణాలో అయితే మరి ఎక్కువగా పోలీస్ నిఘా ఉంది. 

 

ఈ నేపథ్యంలోనే మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం వేతనమే చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఎవరికి అంటే కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బందికి మార్చి నెల వేతనం పూర్తి చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. 

 

అంతేకాదు ఈ రెండు శాఖల ఉద్యోగులకు ఇన్సెంటివ్ కూడా అందించాలని నిర్ణయించారు. ఈ ఇన్సెంటివ్‌‌ను ఒకటీ రెండు రోజుల్లో ఎంత అనే అంశాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

 

కాగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల ముందస్తుగానే ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా ఫైర్ అయ్యాయి. ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శించగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వంటి వారు వైద్యులు, పోలీసుల జీతాలతో కోతలపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సీఎంకు లేక రాశారు. అలాంటి ఈ సమయంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం శుభవార్త అనే చెప్పాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: