కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన మారాలి అని సూచిస్తున్నారు పలువురు. జగన్ కి కరోనా వైరస్ తీవ్రత అర్ధం కావడం లేదని అంటున్నారు. ఆయన దీన్ని ఒక సాధారణ జ్వరం అని మాట్లాడటం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా వస్తే తగ్గిపోతుంది, మందులు అయిదు రకాలు తింటే తగ్గిపోతుంది అంటూ ఆయన మాట్లాడటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. 

 

బుధవారం సాయంత్రం ఆయన ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో ఇదే విధంగా వ్యాఖ్యలు చేసారు. కరోనా విషయంలో ఆయన ఎందుకు అంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా కష్టపడుతున్నారు. కాని జగన్ మాత్రం దాన్ని అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 

 

కరోనా అనేది ఆయన చెప్పే తీరు ప్రకారం చూస్తే... అది చాలా చిన్నది అని అర్ధమవుతుంది జనాలకు. కరోనా విషయంలో జనాలు ప్రాణ భయంతో ఉన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకు మంచిది కాదు. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి రావాలని పలువురు కోరుతున్నారు. ఇక ఆయన ఇలాంటి మాటలు ఇక నుంచి మాట్లాడకుండా దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మంత్రులు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: