ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని దేశాలను కరోనా ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసిందో ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా బ్రిటిష్ పరిశోధకులు వెల్లడించిన సర్వే లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం కాసేపు ఊపిరి పీల్చుకునే లా ఉందని అంటునారు నిపుణులు.  ఈ సర్వేలో అత్యంత కీలకమైన పరిశోధకులు  పాల్గొన్నారని తెలుస్తోంది. లాన్సెట్  జర్నల్ లో  ప్రచురితమైన తాజా ఈ అధ్యయనం ఒకసారి పరిశీలిస్తే...

IHG

కరోనా వైరస్ మరణాలు రేటు ఇప్పటివరకు వేసిన అంచనాల కంటే తక్కువగా ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురించబడింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడినవారు తో పాటు  ఈ మహమ్మారి కి కేంద్ర బిందువుగా ఉన్న వ్యూహంలో బ్రిటిష్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు

IHG

 

కరోనా వైరస్ నిర్ధారణ అయిన నిర్ధారణ కాని కేసులు అన్నిటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. నిర్ధారించబడిన కరోనా  మరణాల రేటు 1. 38 శాతంగా ఉందని పేర్కొంది. అయితే గతంలో కరోనా కేసుల్లో నిర్ధారించిన మరణాల రేటుని అధికారులు 2 నుంచీ 8 శాతానికి ఉండవచ్చని అంచనా వేయడం ఆశ్చర్యాని కలిగిస్తోంది.  కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6  శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఈ శాతం 1. 38 నమోదయింది

IHG

ఇదిలాఉంటే 80 ఏళ్ల పైబడిన వారిలో కరోనా వైరస్ నిర్ధారణ అయితే వారిలో 20 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమని, 30 ఏళ్లలోపు రోగుల్లో కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అవసరమని ఈ సర్వే పేర్కొంది. అయితే వయసు మళ్ళిన వారు అత్యధికంగా ఉన్న దేశాలలో తప్పకుండా ఈ వైరస్ ప్రభావం ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాదు గతంలో వచ్చిన వైరస్ లు  అన్నిటికంటే కూడా ఈ వైరస్ ప్రాణాంతకమైన ని ఈ అధ్యాయము హెచ్చరించింది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎంతగా ఉంటే అంతగా మనం ఈ వైరస్ నుంచీ బయటపడచ్చని కూడా తెలిపడం గమనార్హం.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: