చైనా దేశంలోని వుహాన్ లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ గురించి చైనా అసలు నిజాలు దాచిపెట్టిందని తెలుస్తోంది. కరోనా విషయంలో చైనా వాస్తవాలు చెప్పట్లేదని ఆ దేశ ప్రజల నుంచే విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో కరోనా భారీన పడి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
కానీ వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో మాత్రం కేవలం 3305 మరణాలే చోటు చేసుకున్నాయి. మార్చి నెల మొదటి వారం నుంచి కొత్త కేసులు నమోదు కావడం లేదు. ఇరాన్, అమెరికా, స్పెయిన్ దేశాలలో పరిస్థితిని చూసిన వారు చైనా చెప్పిన మాటలను నమ్మడం లేదు. వేల సంఖ్యలో చితాభస్మం కుండలు వుహాన్ నగరంలోని విద్యుత్ స్మశాన వాటికల్లో దర్శనమిస్తూ ఉండటంతో చైనాను ఆ దేశ ప్రజలే విశ్వసించటం లేదు. 
 
చైనా చెబుతున్న లెక్కల ప్రకారం మార్చి 31 నాటికి చైనాలో మరణాల సంఖ్య 3305. కానీ వుహాన్ లోని చితాభస్మం కుండలను చూస్తే కనీసం 40,000 మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. అక్కడి ప్రజలైతే ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉండవచ్చని అంచనా వేస్తూ ఉండటం గమనార్హం. అక్కడి ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ చైనాలో అసలు పరీక్షలే జరగకుండా ఇళ్లలోనే ఎంతో మంది చనిపోయారని చెప్పారు. 
 
వీటన్నిటినీ బట్టి చైనాలో పరిస్థితి ఏమిటో, మరణాల రేటు ఏమిటో అర్థమవుతుంది. చైనా ప్రపంచానికి ఇష్టం వచ్చిన లెక్కలను చెబుతోందని వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాను అంటువ్యాధిగా ప్రకటించడానికి ఆలస్యం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగానే అలర్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: