కరోనా వైరస్ ను అడ్డు పెట్టుకుని తెలుగుదేశంపార్టీ రాజకీయం మొదలుపెట్టింది. వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచదేశాల ఆర్ధిక మూలాలు పూర్తిగా దెబ్బ తిన్న విషయం అందరూ చూస్తున్నదే. ఇందులో మనదేశం కూడా మినహాయింపేమీ కాదు. ఇదే ప్రభావం మన రాష్ట్రంపైన కూడా పడిందన్న విషయం అందరూ చూస్తున్నదే. అందుకనే ఆదాయ, వ్యయాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి కూడా ఉద్యోగుల జీతాలను రెండు విడతలుగా చెల్లించాలని డిసైడ్ చేశాడు.

 

ఇక్కడ చంద్రబాబునాయుడుతో సహా టిడిపి నేతలు చవకబారు రాజకీయాలు మొదలుపెట్టారు. ఆదాయాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలు ఇవ్వల్సినంత దీనస్ధితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చంద్రబాబు, టిడిపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ఇదే విషయమై నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారని పచ్చమీడియా బయటపెట్టింది.

 

ప్రభుత్వం కరోనా వైరస్ మీద చేసిన ఖర్చు కూడా ఏమీ లేదట. పైగా జనవరి, ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఎంత ఆదాయాలు వచ్చాయో మార్చి నెలలో కూడా అంతే ఆదాయం వచ్చిందని టెలికాన్ఫరెన్సులో తీర్మానించేశారు. ఒకవేళ తమ వాదన తప్పయితే ప్రభుత్వం మొత్తం ఆదాయ, వ్యయాలను బయటపెట్టాలని డిమాండ్  చేయటం దివాళాకోరుతనం తప్ప మరోటి కాదు. వైరస్ మహమ్మారి రాష్ట్రం మొత్తాని కుప్పకూల్చేస్తున్న ఈ సమయంలో కూడా రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు అండ్ కో ను ఏమనాలో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఉద్యోగులకు రెండు విడతల్లో జీతాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించటం ద్వారా ఉద్యోగులను రెచ్చగొట్టాలని అనుకుంటోందా ? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, ఉద్యోగులకు లేని అభ్యంతరాలు మధ్యలో చంద్రబాబు అండ్ కో కు ఎందుకో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన కేసియార్ నిర్ణయంపై మళ్ళీ చంద్రబాబు అండ్ కో కు నోరు లేవటం లేదు. కేసియార్ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ ఓ ప్రకటన చేయొచ్చు కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: