ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లోనే ఈ రాష్ట్రంలో క‌రోనా సెంచ‌రీ కొట్టేసింది.
రెండు జిల్లాలు మిన‌హా అన్ని జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదుకాలేదు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో కొంత నిశ్చింత క‌న‌బడుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వెల్ల‌డించిన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో మొత్తం 111 పాజిటివ్ కేసులు న‌మోద య్యాయి. ఇక జిల్లాల వారీగా ఈ లెక్క ఇలా ఉంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

 

 అలాగే కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 15 మందికి చొప్పున కరోనా సోకింది. పశ్చిమ గోదావరిలో 14 మందకి, విశాఖ జిల్లాలో 11 మందికి, తూర్పు గోదావరిలో 9 మందికి ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డం గ‌మ‌నార్హం.ఇక చిత్తూరు జిల్లాలో ఆరుగురికి, నెల్లూరులో ముగ్గురికి, అనంతపురంలో ఇద్దరికి కోవిడ్ సోకినట్లు అధికారులు ధ్రువీక‌రించారు. నెల్లూరు జిల్లాలో ఒకరు, విశాఖలో మరొకరు క‌రోనా చికిత్స పొంది పూర్తి ఆరోగ్య‌వంతులైన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొంది.  ఇప్పటి వరకూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు.

 

ఢిల్లీలో మ‌ర్క‌జ్ భ‌వ‌న్‌లో ప్రార్థ‌న‌ల్లో పాల్గొని వ‌చ్చిన‌వారి సంఖ్య దాదాపు వెయ్యికి పైగా ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే వెయ్యిమందిని గుర్తించిన అధికారులు దాదాపు 800మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో దాదాపు 90మందికి పైగా కరోనా నిర్ధార‌ణ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. అంత‌కు ముందు 500మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఇందులో 70మందికి పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు. మొత్తంగా 24గంటల్లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. దీంతో రాష్ట్రంలో హైఅల‌ర్ట్ కొన‌సాగుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: