ఓ నెల రోజుల క్రితం అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తిని సీరియస్ గా తీసుకోలేదు. వేసవి కాలం వస్తే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని అంటూ ఆయన ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని కేసులు అమెరికాలో నమోదయ్యాయి. త్వరలోనే మరణాల సంఖ్య కూడా 4 వేల సంఖ్యకు చేరుకోనుంది. అయితే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ పై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణపై ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే... ఇప్పుడు ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి రాకపోయేది అని అమెరికా ప్రజలంతా ట్రంప్ ని విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడతాయి.


ఐతే కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో అంతగా లేనంతవరకు... ట్రంప్ కి ఓటు వేయడానికి 70 శాతం అమెరికా ప్రజలు మొగ్గు చూపారు. కానీ ఎప్పుడైతే కరోనా అమెరికా దేశంలో అడుగు పెట్టిందో... అప్పటినుండి ట్రంప్ పరిపాలనపై చెడు అభిప్రాయం అందరిలో ఏర్పడింది. డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిని నిలుపుకునేందుకు రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా... ఆయనకు ధీటుగా డెమోక్రటిక్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే... అతనికే ఓటు వేయడానికి అమెరికా ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారట.


రాయిటర్స్ మార్చి 6 నుండి మార్చి 9 జరిపిన చిన్నపాటి ఎన్నికల సర్వేలో ఎక్కువ శాతం మంది జో బిడెన్ కి ఓటు వేసేందుకు మొగ్గు చూపారని తేలింది. సోమవారం, మంగళవారం రోజుల్లో 1,100 మంది అభిప్రాయాలను సేకరించగా... వారిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ కు 46 శాతం ప్రజలు మద్దతు తెలపగా... ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కి కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మద్దతు తెలిపారు. దాంతో వెంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు కరోనా వైరస్ ట్రంప్ ఓటమికి కారణం అవుతుందని తెలుస్తుంది. పేదవాళ్ళు, చిన్న ఉద్యోగులు, వ్యాపారులు దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకుంటారు అనే ఉద్దేశంతో వైరస్ నివారణ కొరకు సకాలంలో సరైన కఠిన చర్యలు చేపట్టలేదు ట్రంప్. కానీ ఆ ఆలోచనే తనని నట్టేట ముంచేయనుందని రాజకీయ నేతలు జోష్యం చెబుతున్నారు.


ఏది ఏమైనా ప్రస్తుతం అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, డోనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి కరోనా ని అంతమొందించేందుకు చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ కూడా అతని సూచనలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: