క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విజృంభిస్తుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్నీ బందయ్యాయి. బార్లు, వైన్స్‌లు సైతం బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు గొంతులో చుక్క ప‌డ‌క‌ పిచ్చెక్కిపోతున్నారు. బ్లాకులో మందు ఎంతైనా సరే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మందు మాత్రం దొరకడం లేదు.  ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకోని ఎవ్వరూ కూడా మందు కొని నిల్వ చేసుకోలేదు. కానీ ఆ జనతా కర్ఫ్యూను అమాంతం 21 రోజుల పాటు లాక్‌డౌన్ అయింది.

 

దీంతో ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు అయ్యింది.. మందిబాబుల ప‌రిస్థితి. చుక్క పడనిదే దేహం కదలని పరిస్థితుల్లో మందుబాబులు వణికిపోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా మద్యం చుక్క పడక ఆగమాగమైపోతుర్రు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరోవైపు వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే.. 1956 నుంచి అన్ని రకాల మద్యం, కల్లు సరఫరాపై రాష్ట్రంలో ఎప్పుడూ నియంత్రణ లేదు. 1993లో అప్పటి సీఎం విజయభాస్కరరెడ్డి సారాపై నిషేధం విధిస్తే.. 1994లో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. జనవరి 16, 1995 నుండి మార్చి31, 1997 వరకు రాష్ట్రంలో మద్య పాన నిషేధం అమలు చేశారు. ఈ సమయంలో కల్లు సరఫరాతో పాటు స్టార్‌ హోటళ్లతో పాటు కొందరు డాకర్లు సూచించిన వ్యక్తులకు ప్రత్యేక పాస్‌ల ద్వారా మద్యం పంపిణీ చేశారు. 

 

ఇక  ఆర్మీ సిబ్బందికి  మిలిటరీ క్యాంటిన్లలో మద్యం సరఫరా చేశారు. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ గతానికి పూర్తి భిన్నంగా ఈసారి ఆర్మీ క్యాంటిన్లతో పాటు స్టార్‌ హోటళ్లకు సరఫరా నిలిచిపోయి లాక్‌డౌన్‌ కావటం, ఏకంగా పది రోజుల పాటు మద్యం సరఫరా నిలిచిపోవటంకొత్త చరిత్రేనని మద్య నియంత్రణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మ‌రియు  పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెచ్చుకునే ప‌రిస్థితి కూడా లేదు. దీనిని బ‌ట్టీ 60 ఏళ్ల‌కు మద్య నియంత్రణ పూర్తి స్థాయి అమలవుతోందని పేర్కొంటున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: