అమెరికా లేదు... ఇండియా లేదు... చైనా లేదు.. ఇట‌లీ లేదు.. బంగ్లాదేశ్ లేదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌మ్మేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు 9 ల‌క్ష‌లు దాటేసి ఏకంగా 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంటున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఇక బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందడం అగ్రరాజ్యంలో ఆందోళన కలిగిస్తోంది.

 

కరోనాతో ఒక్కరోజులో అత్యధిక మంది మృతి చెందడం ఇదే కావడం గమనార్హం. అక్కడ కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. నిన్న ఒక్కరోజే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా భారినపడి మృతి చెందారు. మ‌న‌దేశంలో కూడా క‌రోనా బాధితులు 2 వేల‌కు చేరువ అవుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో 127 కేసులు ఉండ‌గా.. ఏపీలో 111కేసులు ఉన్నాయి. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 9 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 35, 957

మృతుల సంఖ్య - 47, 245

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,94, 286

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 426

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 41, 531

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 15, 215 - 5, 110

ఇట‌లీ - 1, 10, 574 - 13, 155

స్పెయిన్ - 1, 04, 118 - 9, 387

 


భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1998

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 434 కొత్త కేసులు న‌మోదు

కొత్త కేసులు - ---

మృతులు - 58

తెలంగాణ‌లో కేసులు - 127

బుధ‌వారం కేసులు - 30

తెలంగాణ మృతులు - 9

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 111

బుధ‌వారం కేసులు - 67

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: