కరోనా వైరస్ గంటల వ్యవధిలో వేల సంఖ్యలో కేసుల నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారి పేరు చెప్తినే అల్లాడి పోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయ్యినప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. 

 

చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి పుట్టిన 14రోజుల్లోనే ప్రపంచ దేశాలకు ఎగబాకింది. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాలు సైతం ఈ వ్యాధి పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాలను వణిస్తోంది. కరోనా వైరస్ ప్రభావానికి అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్ష మైలురాయి దాటినా సంగతి తెల్సిందే. 

 

ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం ఆమెరికా, ఇటలీ తర్వాత లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిన మూడో దేశంగా స్పెయిన్ నిలిచింది. బుధవారం రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

 

మంగళవారం దేశవ్యాప్తంగా 94, 417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగిపోయాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక.. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా రాత్రికి రాత్రి భారీగా పెరిగిపోయిందన్నారు. మంగళవారం నాటికి 8,189మంది ఈ కరోనా వైరస్ సోకి ప్రాణాలుకోల్పోయారు. ఒక రోజులోనే రికార్డుస్థాయిలో 864 మరణాలు సంభవించాయి. బుధవారం నాటికి ఆ సంఖ్య 9,053కి చేరిందని ఆ దేశం మంత్రిత్వ శాఖ తెలియజేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: