ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది.  ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎన్ని భద్రతలు పాటిస్తున్నా.. ప్రతిరోజూ ఈ వైరస్ వల్ల మరణాల సంఖ్య, బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది.  సామాన్యుల విషయంలోనే కాదు.. ప్రముఖులను కూడా కరోనా వైరస్ వదలడం లేదు. ఈ మద్య ఓ బాలీవుడ్ సినీ నటుడు మరణించిన విషయం తెలిసిందే.  మరికొంత మంది సెలబ్రెటీలకు ఈ వైరస్ సోకింది.  తాజాగా కరోనా వైరస్ మరో ప్రముఖుడి ప్రాణాలను బలితీసుకుంది. 

 

అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా ఈ ఉదయం కన్నుమూశారు.  బుధవారం ఆయనకు కరోనా వైరస్ అని తెలిసింది.. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అమృత్‌సర్ సివిల్ సర్జన్ తెలిపారు.  ఇప్పటికే పంజాబ్ లో ఓ వ్యక్తి కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.  పంజాబ్‌లో ఇది రెండో కరోనా కేసు కాగా, జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే.

 

హోషియార్‌పూర్‌కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు.  మతపరమైన బోధనలు చేసేవారు వివిధ ప్రదేశాలకు వెళ్లడం అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కరోనా రావడానికి ముఖ్యకారణం అవుతుందని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: