ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణుకుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. ఈ వైరస్ భారీన పడి పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో కరోనా భారీన పడి ఆరు వారాల శిశువు మృతి చెందింది. 
 
కనెక్టికట్ రాష్ట్ర గవర్నర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలు. గవర్నర్ లెడ్ నారెంట్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ సోషల్ మీడియా ఖాతాలో ఆరు వారాల శిశువు గత వారం స్పందన కోల్పోవడంతో ఆస్పత్రిలో చేర్పించారని... రెండు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. 
 
ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో అధికారులు న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ రాష్ట్రాలలోని ప్రజలు అత్యవసరం ఐతే తప్ప బయటకు రావద్దని సూచించారు. దాదాపు లక్ష కేసులు ఈ మూడు రాష్టాల నుంచే నమోదు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ప్రజలు పూర్తిగా ఇంటికి పరిమితమైతే మాత్రమే కరోనా భారీన పడకుండా తప్పించుకోవచ్చని సూచించారు. 
 
ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడం వల్ల తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలు కూడా సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 2,13,372 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ కేవలం న్యూయార్క్ నగరంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 4,476 మంది కరోనా భారీన పడి మృతి చెందగా న్యూయార్క్ లోనే 2000 మంది మృతి చెందడం గమనార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: