నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్ధన సదస్సుకు హాజరైన వారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్రార్ధనా సదస్సులో పాల్గొన్న కారణంగా కరోనా పీడితుల సంఖ్య ఘోరంగా పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 30 కొత్త కేసులు నమోదు కాగా... కరోనా బారినపడిన ముగ్గురు మరణించారు. దాంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా కలవరపడుతుంది. కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండగా... మరొక వైపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంటే... తెలంగాణ సర్కారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.


అయితే వీరికి అండగా నిలబడాలని చాలామంది ముందుకు వస్తున్నారు. తాజాగా హైదరాబాదుకు చెందిన సన్ డయాగ్నొస్టిక్స్ అనే ఒక శాస్త్రీయ పరికర సంస్థ మాస్క్ లను, హ్యాండ్ శానిటైజర్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ సంస్థ మాస్కులను, హ్యాండ్ శానిటైజర్లను కోవిడ్ 19 ని నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్లకు, ఇంకా ఇతర సిబ్బందికి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.


ఆ సంస్థ ల్యాబ్ కోఆర్డినేటర్ ఎ.వి.ఎస్ జగన్నాథ రావు మాట్లాడుతూ... 'లాక్ డౌన్ ప్రకటించిన వేళ మేము మాస్కులను, హ్యాండ్ శానిటైజర్లను తయారుచేసి ప్రభుత్వానికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాము',  అని ఆయన అన్నారు. ఈ సంస్థ వారు చెప్పినట్టుగానే ఉచిత మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహమ్మద్ రఫీ అనేేే ఒక వాలంటీర్ మాట్లాడుతూ తనకి ఉచితంగా మాస్కులు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపాడు.


ఇకపోతే, తిండి లేకుండా ఇంటికి వెళ్లేందుకు రోడ్లపై వందల వేల కిలోమీటర్లు నడుస్తున్న వారికి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు చాలా మంది ప్రజలు. ఇలా కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాటి మనిషికి సహాయం చేయాలని ఎంత మంది ముందుకు రావటం ప్రస్తుతం అందరికి సంతోషం కలిగిస్తుంది. అతి త్వరలోనే కరోనా మహమ్మారి మన దేశం నుండి పారిపోవాలని ఆశిద్దాం.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: