క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని ఏ స్థాయిలో అల్ల‌క‌ళ్లోలం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. 42 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. అయితే ఏపీలో సైతం క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది. కేవ‌లం బుధ‌వారం ఒక్క‌రోజులోనే మొత్తం 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి ఆరుగురికి ఆక్సిజన్‌ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్‌ డాక్‌యార్డ్‌ అభివృద్ధి చేసింది. దీంతో ఒకే సిలిండర్‌ నుంచి ఆరు పైపుల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేయవచ్చు. ఎంవోఎం (మల్టీ ఫీడ్‌ ఆక్సిజన్‌ మెనిఫోల్డ్‌) పేరుతో ఈ పరికరాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్‌కు పైప్‌ ద్వారా ఆక్సిజన్‌ అందించే సదుపాయం ఉంటుంది. 

 

కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కాలేజీలు, హోటల్స్, కళ్యాణ మండపాలు వంటి చోట్ల ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో ప్రతీ రోగికీ ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేయడం కష్టంతో కూడిన పని. దీన్ని దృష్టిలో పెట్టుకుని నావల్‌ డాక్‌యార్డ్‌ సిబ్బంది ఈ ఎంవోఎం పరికరాన్ని అభివృద్ధి చేసి పరీక్షించారు. ఈ ఎంవోఎం విధానం సక్సెస్ కావడంతో 25 పరికరాలను విశాఖ నేవీ అధికారులు ప్రభుత్వానికి ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. 

 

ఇక కోవిడ్ ఉన్న వారిలో ఐదు నుంచి ఎనిమిది శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ల అవసరం కాబ‌ట్టి.. ఐసోలేషన్ వార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కాగా,దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్ధనలతో సంబంధం ఉండటమే దీనికి నిదర్శనం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

  

మరింత సమాచారం తెలుసుకోండి: