ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు వ్యవహారం భలే విచిత్రంగా ఉంటోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే అప్పుడప్పుడు తానే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ఫీలవుతున్నాడేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి అందరిలోను. మిగిలిన విషయాలు ఎలాగున్నా తాజాగా కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుండి చంద్రబాబు వైఖరిని చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

తాజాగా కరోనా వైరస్ తీవ్రతపై చంద్రబాబు నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. వైరస్ పెరిగిపోతున్న స్పీడుపై ఆందోళన వ్యక్తం చేశాడు. దేశంమొత్తం మీద వైరస్ చాలా స్పీడుగా విస్తరిస్తున్న వైనం నిపుణులతో సుదీర్ఘంగా చర్చించాడు. వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ఏడు రాష్ట్రాల్లో ఏపిని కూడా చేర్చటంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశాడు.  వైరస్ ను కంట్రోల్ చేసే విషయమై నిపుణులతో చర్చించాడు.

 

వైరస్ వ్యాపిస్తున్న తీరు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై జనాల్లో కలిగించాల్సిన  చైతన్యం తదితరాలపై చాలా సేపే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం వచ్చేస్తుంది ఏపికి ముఖ్యమంత్రి ఎవరు ? అని.  బంపర్ మెజారిటి గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డేమో వైరస్ విషయంలో మూడు నాలుగు రోజులకోసారి జనాలతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నా ఆ విషయాలేవీ పెద్దగా జనాల్లోకి వెళ్ళటం లేదు.

 

అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి గంటలకు గంటలు వైరస్ పై మాట్లాడేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంతమంది నిపుణులతో మాట్లాడినా ఏమిటి ఉపయోగం ? వైరస్ విషయంలో జగన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఒకటికి పదిసార్లు ఆరోపణలు గుప్పించటం తప్ప చంద్రబాబు చేస్తున్నది కూడా ఏమీ లేదు.  వైరస్ విషయంలో జగన్ కన్నా చంద్రబాబే జనాలకు టీవిల్లో ఎక్కువగా కనబడుతున్నాడు. దాంతోనే అందరికీ అనుమానం వచ్చేస్తోంది చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నాడనే భ్రమల్లో ఉన్నాడా అని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: