లోకంలో కారోనా కాలకూట విషంలా మారి చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందర్ని మింగేస్తుంది.. దీని కాటుకు ప్రపంచం మొత్తం భయం గుప్పిట్లో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.. ఈ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఇంత వరకు మందులైతే రాలేదు గాని.. ఈ వైరస్ సోకకుండా మాత్రం జాగ్రత్తపడాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.. ఇక ఈ కరోనా బారిన పడిన ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి.. ఎవరికి ఎవరు ఏం కాకుండా, ఒకరికి ఒకరు సహాయం చేసుకోకుండా.. చివరి చూపులకు కూడా నోచుకోకుండా అనాధలా మారుతున్నారు..

 

 

ఈ మాయదారి రోగానికి అగ్రరాజ్యాలే అడుగు కదపలేక అతలాకుతలం అవుతూ, ఈ విలయానికి విలవిలలాడి పోతున్నాయి.. ఇప్పటికే కొందరు మతోన్మాదులు కరోనాను అంటించుకుని దీన్ని మరింతగా వ్యాపింప చేస్తున్నారు.. ఈ సమయంలో భారతదేశ పౌరులందరు ఒక్కటిగా మారి ఈ కరోనాను జయిస్తేనే ఇక్కడి ప్రజలు ప్రాణాలతో ఉంటారు కానీ ఇలా పిచ్చిపట్టినట్లుగా మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రవర్తిస్తే చివరికి మిగిలేది శవాల కుప్పలు మాత్రమే.. చావు అనేది అందరికి తప్పదు.. ఈ చావుకు కులం మతం లేదు.. మరెందుకు ఈ నికృష్టపు ఆలోచనలతో మతాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు..

 

 

మనిషి మూర్ఖత్వంతో కుటుంబ సభ్యులకే కాదు సమాజానికి కూడా కరోనా కంటే ఎక్కువ విషపు పురుగుగా మారుతున్నాడు.. ఒకరకంగా మతోన్మాదులకంటే కరోనా ఏమంత గొప్పది కాదు.. ఇకపోతే కరోనా వల్ల అభం శుభం తెలియని, అసలు లోకాన్నే కనుల నిండా చూడని పసిపాప మరణించింది.. అమెరికాలో, కరోనా లక్షణాలతో కనెక్టికట్‌ రాష్ట్రంలో తాజాగా ఆరు వారాల శిశువు మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ బుధవారం వెల్లడించారు. శిశువు మరణంతో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో ఈ చిన్నారే అతి చిన్న వయస్కురాలుగా నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు...

 

 

ప్రస్తుతం దేశంలో ఈ వైరస్ విజృంభిస్తోందని, ఇంట్లోనే ఉండటం వల్ల వైరస్‌ను వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మంచి మాటలు వినని దరిద్రుల వల్ల ఇటలీ, అమెరికా ప్రమాదం అంచుకు చేరుకుంది. అందరు చచ్చాక, అయిన వాళ్లను దూరం చేసుకున్నాక బ్రతికి ఉన్న వారు సాధించి పొడిచేది ఏం ఉండదు.. అందుకే దయచేసి అందరు ఆలోచించి అడుగువేయండి.. మీ ఆలోచనలే ఎందరో భవిష్యత్తుకు పునాదులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: