కరోనా ప్రభావం ప్రజల ను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. 

 

 

 

కరోనా ప్రభావం ఎక్కువ గా ఉండటం తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ విపత్కర సమయం లో ప్రభుత్వాల కు అండగా ఉండాలంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు జన సైనికులు, అభిమానుల కు ఓ పిలుపు ను ఇచ్చారు. 'నేను సైతం' అంటున్నారు.. కరోనాపై పోరులో భాగంగా ఏప్రిల్‌ ౩న ప్రతి ఒక్క భారతీయుడు దేశం కోసం రూ.100 ఆ పైన.. ఎవరి శక్తి కొద్ది వారు.. 

 

 

 

పీఎం కెర్స్ కు విరాళం ఇచ్చి ప్రధాని మంత్రి మోదీకి నైతిక మద్దతు తెలుపుదాం అన్నారు. అలాగే ఇంకా పది మందిని విరాళాలు ఇచ్చేలాగా ప్రోత్సహిద్దాం అన్నారు.చాలా మంది సినీ కార్మికులను, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులను ఆదుకుంటున్నారు. అందుకే ప్రజలను కూడా లేనివారిని ఆదుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. 

 

 

 

అంతేకాదు పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నివారణ, సాయం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు విడిగా భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు. పవన్ నిజంగానే పెద్ద మనుసు చాటుకోవడమే కాదు అందరికి సాయమందించాలని పిలుపునిచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: