కరోనా వైరస్ దెబ్బకు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన షెన్ జెన్ లో కొన్ని జంతువుల మాంసాన్ని నిషేధిస్తు నిర్ణయం తీసుకుంది. చైనాలో ఎక్కడ చూసినా అనేకరకాల జంతువుల మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారని అందరికీ తెలిసిందే. తినటంలో చైనా వాళ్ళు తన పర భేదాలు చూపరు. అన్నీ జంతువులకు సమన్యాయం చేస్తారు. పాములు, గబ్బిలాల్లాంటి తినటం వల్లే కరోనా వైరస్ వచ్చిందని  ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇందులో భాగంగానే  కుక్కులు, పిల్లులు, బల్లులు, పాముల మాంసాన్ని అమ్మటం, కొనటాన్ని చైనా ప్రభుత్వం  పూర్తిగా నిషేధించింది. తన నిర్ణయం మే 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించటంతో జంతు ప్రేమికులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కనీసం కరోనా వైరస్ నేపధ్యంలో అయినా జనాలు జంతువులను తినటం మానేస్తారని జంతుప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

కుక్కలు, పిల్లుల మాంసాన్ని శాస్వతంగా నిషేధిస్తు నిర్ణయం తీసుకున్న నగరంగా షెన్ జెన్ రికార్డు సృష్టించింది. తమ నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలతో పాటు భారీ జరిమానా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. జరిమానా ఎలాగుంటుందంటే పట్టుబడిన జంతువులు, మాంసం విలువను బట్టి  నిర్ణయిస్తామని చెప్పటం గమనార్హం. అంటే నిషేధం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లే అందరూ అనుకుంటున్నారు.

 

అయితే ఇక్కడో విషయం గమనించాలి. అసలు కరోనా వైరస్ సోకిందే వూహాన్ నగరం నుండి. కానీ వూహాన్లో మాత్రం జంతుమాసంపై ఎటువంటి నిషేధం విధించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. చైనా మొత్తం మీద జంతుమాంసం విక్రయాల్లో షెన్ జెన్ ది ఐదో స్ధానం. ఇప్పటికే తైవాన్, హాంకాంగ్ దేశాల్లో కుక్కల మాంసాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. వైరస్ తీవ్రంగా ఉన్న వూహాన్ లో కాకుండా 1.25 కోట్లమంది జనాభా ఉండే  షెన్ జెన్ నగరంలో జంతుమాంసాన్ని ఎందుకు  నిషేదించినట్లో అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: