కరోనా వైరస్.. కరోనా అనే మూడక్షరాల పదం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 9 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అందులో 49 వేలమందికిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత నాలుగు రోజుల నుండి మన దేశంలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

ఇంకా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను అల్లాడించిన ఈ కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్ లో 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 127 కేసులు నమోదయ్యాయి.

 

కరోనా వైరస్ భారీన పడి తెలంగాణాలోఇప్పటివరకు 9 మంది కరోనా వైరస్ పేషెంట్లు మృతి చెందారు. అయితే మృతి చెందిన వారిలో ఆరుగురు పేషేంట్లు మర్కజ్ ప్రేయర్ కు వెళ్లి వచ్చిన వారే.. అయితే ఆ ఆరుగురిలో నలుగురు మరో 60 మంది క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నారు అని తేలింది. మరి ఆ 60 మంది ఎవరికీ సన్నిహితంగా ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

 

మార్చి 13 నుంచి 17 వరకు ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారిలో తెలంగాణ వ్యాప్తంగా 1030 మంది ఉండగా, వీరిలో 603 మంది గ్రేటర్‌ వాసులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉంది. గుర్తించిన వారిలో ఇప్పటికే 35 మందిలో పాజిటివ్‌ వచ్చింది. బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. అందులో నలుగురుకు 60 మంది క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నారు అని తేలింది. దీంతో పాతబస్తీలో ప్రజలు వణికిపోతున్నారు.. ఆ 60 మంది ఎక్కడ ఉన్నారు అని.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: