కరోనా వైరస్ దెబ్బకి దేశంలో అనేక రంగాలు మొత్తం లాక్ డౌన్‌ లోకి వెళ్లాయి. దీనితో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ కస్టమర్ల అందరికి ఇబ్బంది లేకుండా లోన్ EMI పై 3 నెలల మారటోరియం ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకులు అన్ని ఒక్కొక్కటిగా ఈ ఫెసిలిటీని కస్టమర్లకు ఇస్తున్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్ sbi, దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ hdfc, ప్రముఖ బ్యాంక్ ICICI బ్యాంకులు తమ కస్టమర్లకు EMI మారటోరియం సౌకర్యాన్ని ఇస్తున్నాయి.

 

 

sbi కస్టమర్లు లోన్ EMI ఒకవేళ కట్టకూడదు అనుకుంటే, బ్యాంక్‌ కు న్యాక్ ఎక్స్‌టెన్షన్ ఫామ్‌ ను ఫిల్ చేసి ఒక మెయిల్ పంపితే చాలు. బ్యాంక్ బ్రాంచ్, సర్కిల్ ప్రాతిపదికన బ్యాంకు ఈ మెయిల్ ఐడీ మారుతుంది. sbi వెబ్సైట్‌ లో మెయిల్ ఐడీ వివరాలు అందుబాటులో ఉంచింది. కస్టమర్లు ఒకవేళ EMI కట్టడం అనుకుంటే మాత్రం ఏం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగానే మీరు లింక్ చేసిన అకౌంట్ నుంచి మీ డబ్బులు కట్ అవుతాయి. ఈ - మెయిల్ ఐడీ, న్యాక్ ఎక్స్‌టెన్షన్ ఫామ్ కోసం ఈ https://www.sbi.co.in/stopemi లింక్‌ పై క్లిక్ చేసి పొందండి. లేకుంటే బ్యాంక్ బ్రాంచ్‌ కు వెళ్లి ఒక లెటర్ రాసి ఇచ్చి EMI మారటోరియం ఫెసిలిటీని అందుకువొచ్చు.

 

 

 
అలాగే sbi దారిలోనే hdfc, ICICI బ్యాంక్ లు కూడా నడిచాయి. ఈ రెండు బ్యాంకులు కూడా వారివారి కస్టమర్లకు EMI మారటోరియం ఆప్షన్ ని అందిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ బ్యాంకులు వారి సదరు కస్టమర్లకు మెసేజ్‌ లు కూడా పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఈ సదుపాయాన్ని అవసరమనుకుంటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. లోన్ EMI మారటోరియం ఆప్షన్ ఎంచుకునే వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంది అదేమిటంటే ... మారటోరియంలో EMI కట్టకపోయిన సరిపోతుంది. కాకపోతే వడ్డీ మాత్రం ఇందుకు పడుతుంది. కనుక మీరు గాని 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే, మీ లోన్ టెన్యూర్ ఈ 3 నెలలు పెరుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఇది  క్రెడిట్ స్కోర్‌ పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: