మ‌న‌దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతున్నాయి. కేవలం 24 గంటల్లోనే సుమారుగా 400 కేసులు నమోదయ్యాయి. క‌రోనా ప్ర‌భంజం స్టార్ట్ అయ్యాక ఎప్పుడూ న‌మోదు అవ్వ‌ని విధంగా మంగ‌ళ‌వారం 300 కేసులు న‌మోదు అయితే బుధ‌వారం ఆ రికార్డు బీట్ చేసి ఏకంగా 400కు పైగా కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇక గ‌త మూడు రోజుల్లోనే చూస్తే మ‌న దేశంలో ఏకంగా 1000 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక గురువారం మ‌ధ్యాహ్నంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,000 దాటింది. కరోనా బారిన పడిన వారితో దేశంలో ఇప్పటి వరకు 59 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రభుత్వాలన్నీ మరింత అప్రమత్తమవుతున్నాయి.



దేశంలో కరోనా రెండో దశ నుంచి మూడో దశకు అంటే సామజిక వ్యాప్తి దశకు చేరుకుందని, ప్రతి ఒక్కరు మరింత జాగ్రత్త వహించాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మ‌న దేశంలో క‌రోనా హాట్ స్పాట్ ప్రాంతాలు ప్ర‌స్తుతం 10 రాష్ట్రాల్లో విస్త‌రించి ఉన్నాయి. ప్ర‌స్తుతం కేసులు అన్నీ కూడా ఈ రాష్ట్రాల్లోనే విస్త‌రించి ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక ద‌క్షిణ భార‌త‌దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో తబ్లీగ్ జమాత్ ప్రార్థనలు జరిగాయి. కాగా ఆ ప్రార్థనలకు హాజరైన వారి వల్లే భారత దేశంలో వైరస్ వ్యాప్తి పెరిగుతుందని వారి కోసం గాలింపు ముమ్మరం చేశారని ప్రభుత్వాలు తెలుపుతున్నాయి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: