క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు ఇలా ఎంద‌రో త‌మ వంతు సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఇక తాజాగా  చైనాకు చెందిన సామాజిక మాద్యమం టిక్‌టాక్.. కరోనాపై పోరాటానికి భారత్‌కు భారీ విరాళం ప్రకటించింది.

 

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కు లు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని టిక్ టాక్ అంచనా వేస్తోంది. ఈ మేరకు టిక్‌టాక్ ఇలా పేర్కొంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు మరియు సహాయక వైద్య సిబ్బంది ముందంజలో ఉన్నారు. నివారణ చర్యగా పౌరులు సామాజిక దూరం మరియు ఇంట్లో ఉండటాన్ని అభ్యసిస్తుండగా, మనందరినీ సురక్షితంగా మరియు రక్షణగా ఉంచడానికి భారత వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 

 

తత్ఫలితంగా, మన వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారిన పడతారు. ఇలాంటి సమయాల్లో, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంద‌ని టిక్ టాక్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇప్పటికే 20,675 సూట్లను మొదటి విడత కింద భారత్‌కు పంపించినట్లు 1,80,375 సూట్లను ఈ శనివారం నాటికి పింపిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం పేర్కొంది. మిగతా 2,00,000 సూట్లను రాబోయే రోజుల్లో అందిస్తామని తెలిపారు. ఇక ఆలస్యంగానే అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ ముందుకు వచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: