రోజు రోజుకి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. అన్ని దేశాల్లోను కరోనా తన విశ్వరూపం చూపిస్తుంది. పది లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉండగా 50 వేలకు చేరువలో మరణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దాదాపుగా కరోనా గుప్పిట్లో ఉంది. అన్ని దేశాలు కూడా తమ పౌరుల ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 936,725 గా ఉన్నాయి. వీరిలో 47,260 మంది ప్రాణాలు కోల్పోయారు. 194,604 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 694,861 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో 215,344 మంది కరోనా బారిన పడగా 5,100 మంది కరోనా కారణంగా మరణించారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. అమెరికాలో రెండు లక్షలు దాటాయి. 

 

మరణాల విషయంలో అమెరికా వేగంగా ముందుకి వెళ్తుంది. అక్కడ బుధవారం ఒక్క రోజే దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశం విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు వేలు దాటాయి. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కరోనా తెలంగాణాలో 127 మందికి ఆంధ్రప్రదేశ్ లో 132 మందికి సోకింది. తెలంగాణాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: