కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు మన దేశంలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. దీనితో అనేక వ్యాపార సంస్థలు, వ్యాపార సముదాయాలు కూడా మూత పడ్డాయి. ప్రముఖ పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తులను ఆపేశాయి. చిన్న చిన్న ఐటి కంపెనీలు కూడా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్క్ ఫ్రం హోం చాలా మంది చేయడం లేదు. 

 

కొంత మంది చెప్పకుండానే ఉద్యోగాలు మానేసే పరిస్థితి ఏర్పడింది. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ కారణంగా మన దేశంలో 136 మిలయన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అంటే దాదాపు 15 కోట్ల ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడినట్టే. మార్కెటింగ్, ఐటి, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు, ఇలా ఎన్నో పోయాయి. ప్రధానంగా ఉత్పత్తులు ఆగిపోవడంతో ప్రముఖ కంపెనీలు అన్నీ దాదాపుగా నష్టాల్లోనే ఉన్నాయి ఇప్పుడు. 

 

వీటిలో కోట్లాది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. యాజమాన్యాలు అప్పుల పాలు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇంకొంత కాలం కొనసాగితే మాత్రం ఇంకో 10 కోట్ల వరకు నిరుద్యోగులు గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ లాక్ డాన్ ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇంకెన్ని ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: