ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలకి ఇబ్బంది కలుగకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గానీ కొందరు బుద్ధి హీనుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. ఈ సమయంలో ప్రజల సొమ్ము దోచుకోవడానికి రాబంధులల్లే అవినీతిపరులు కాచుకు కూర్చున్నారు.. ఇదిగో ఒక అవినీతి పరుడు ప్రజలకు పంచవలసిన రేషన్ కోటాని ఎలా కొల్లగొట్టుతున్నాడో చూస్తే పేదవాడి గుండే తరుక్కుపోతుంది..

 

 

ఇకపోతే ఏపీలో రేషన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల నిమిత్తం డీలర్లు బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నారు. కాగా రేషన్ సరుకులు తీసుకోవడానికి ఒక్కసారిగా షాపుల ముందు జనాలు క్యూ కట్టారు.. ఇలాంటి పరిస్దితి ఒక్క షాపుకు పరిమితం కాలేదు.. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు జనాలతో నిండిపోయాయి... కరోనా, లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రభుత్వం. సామాజి దూరం పాటిస్తూ అందరూ రేషన్ తీసుకెళ్లేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అయితే ఈ పంపిణి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా, ఓ రేషన్ డీలర్ మాత్రం పేదవాళ్ల కడుపు కొడుతున్నాడు.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు పంపిణీ చేస్తున్న సరుకుల్లో కోత పెడుతున్నాడు ఒక దరిద్రుడు. ప్రభుత్వం నుంచి వచ్చిన అర కేజీ బరువు ఉండే చక్కెర ప్యాకెట్‌లో కొంత ఓ సంచిలో పోసి మిగిలింది అలాగే ఉంచి ప్యాకెట్‌కు పిన్నులు కొడుతున్నాడు దీన్ని గమనించిన ఓ వ్యక్తి డీలర్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించగా.. అతడు బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల విషయంలో ఇలా మోసం చేయడం సిగ్గుమాలిన ఘటనగా పలువురు పేర్కొంటున్నారు..

 

 

అదీగాక వెంటనే ఆ రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు.. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ మోసం ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఈ వార్త ప్రస్తుతం అంతటా వ్యాపించింది.. మరి జగనన్న ఇలాంటి గద్దల రెక్కలు తెంచి పేదవాడికి న్యాయం చేస్తాడనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ విషయం తెలిసిన వారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: