కరోనా  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా వేల మరణాలు.. లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమావేశంలో పాల్గొన్నారు.  గడిచిన 12 గంటల్లో దేశంలో 131 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య 1965కు చేరుకున్నట్లు వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది. 

 

కాగా, ఉదయం 11గంటల నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను మోదీ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారు.  కరోనా నివారణకై రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి సీఎం నిశితంగా వివరించారు. గడిచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు వివరించారు. నమోదైన కేసుల్లో 111 జమాత్‌‌కు వెళ్లినవారని.. వారితో కాంటాక్టులో ఉన్నవారేనని ప్రధానికి వివరించారు.  కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి తెలిపారు.

 

వారందర్నీ క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని మోదీకి జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌-కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.  ప్రస్తుతం 1764 యాక్టివ్‌ కేసులు కాగా 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 50 మరణాలు సంభవించినట్లుగా వెల్లడించింది.  ఇదిలా ఉంటే కరోనా వైరస్ భయంతో ప్రజలు ఆస్పత్రులకు రావడానికి జంకుతున్నారు. వద్దామనుకున్నవారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఔట్‌పేషెంట్ విభాగాలు బంద్ అవుతున్నాయి.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: