ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సమయంలో సీఎం జగన్  పలు అంశాలను  మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన చర్యలను మోదీకి వివరించారు. రాష్ట్రంలో రెండు రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోవుతున్నాయని చెప్పటంతో పాటు కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను సీఎం వివరించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 132 కరోనా కేసులు నమోదయ్యాయని... ఆ కేసులలో 111 కేసులు ఢిల్లీ జమాత్ కు హాజరై రాష్ట్రానికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులేనని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వారిని వెంటనే గుర్తిస్తున్నామని... వారిని వెంటనే క్వారంటైన్ కు లేదా ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 
 
కరోనా కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... తమను ఆదుకోవాలని జగన్ మోదీని కోరారు. రాష్ట్రంలో మెడికల్ పరికరాల కొరత ఉందని... కేంద్రం పరికరాల విషయంలో సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సీఎం జగన్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి కోసం, కొత్త కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. 
 
రాష్ట్రంలో ఈరోజు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 132కు చేరింది. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 11 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: