ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా ప్రభావం ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. అంతేకాక ప్రభుత్వం ఇస్తున్న సూచనలను అందిస్తూ వస్తున్నారు. 

 

 

 

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..అంతేకాక అన్నీ రకాల వాణిజ్య పరిశ్రమలు, సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. ఇక మధ్య దుకాణాలు మూతపడటంతో మందుబాబులకు చుక్కెదురైంది. అంతేకాక ముందుకు బానిసలైన ఎందరో వింత ప్రవర్తనలు చేస్తూ వస్తున్నారు. 

 

 

 


ఈ నేపథ్యంలో  అనంతపురంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వివరాల్లోకి  వెళితే.. అక్రమంగా తెచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న నకిలీ మద్యం సీసాలను ఏపీ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

 

 

అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని మనేసముద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న నకిలీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.హిందూపురం పరిసర ప్రాంతాలలో విక్రయించేందుకు బెంగళూరు నుంచి కారులో తరలిస్తున్న 5 కేసుల నకిలీ మద్యం పట్టుబడింది. నకిలీ మద్యం తరలిస్తున్న ఈడిగ గుణ శేఖర్, ఈడిగ హరీష్ చోల, ఈడిగ ఓబి రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మరికొందరి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు..  
 

మరింత సమాచారం తెలుసుకోండి: