భార‌త్‌ను క‌రోనా క‌మ్మేసింది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్త‌రాఖండ్ మిన‌హా అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు విజృంబిస్తున్నాయి. ఇక గురువారం ఉద‌యంతో మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల‌కు చేరుకుంది. ఇక గ‌త రెండు రోజుల్లోనే కేసులు స్వైర‌విహారం చేస్తున్నాయి. గ‌త 12 గంట‌ల్లోనే చూస్తే దేశ‌వ్యాప్తంగా ఏకంగా 130 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక గ‌త రెండు రోజుల్లోనే కేసులు భారీగా పెరిగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో తబ్లీగ్ జమాత్ ప్రార్థనలు.  ఈ ప్రార్థనలకు హాజరైన వారి వల్లే భారత దేశంలో వైరస్ వ్యాప్తి పెరిగుతుందని వారి కోసం గాలింపు ముమ్మరం చేశారని ప్రభుత్వాలు చెపుతున్నాయి.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల్లో సుమారుగా 95 శాతం మంది ఢిల్లీ వెల్లివచ్చిన వారే ఉన్నారని, వారిలో 6,000 మందిని గుర్తించి, 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించారని తెలిపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు రోజుల్లోనే ఒక్క‌సారిగా కేసులు పెర‌గ‌డం వెన‌క కూడా కేవ‌లం ఢిల్లీ ప్రార్థ‌న‌లే ఉన్నాయ‌ని అంటున్నారు. ఇక తెలంగాణ‌లో కేసులు 127కు చేరుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది మృతిచెందారు. గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, యశోదలో ఒకరు చొప్పున ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

 

ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 132కు చేరింది. ఇందులో బుధవారం రాత్రి 24 మందికి కరోనా నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక జిల్లాల ప‌రంగా చూస్తే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 15 మందికి చొప్పున కరోనా వ్యాపించింది. ఇక పశ్చిమ గోదావరిలో 14 మందకి, విశాఖ జిల్లాలో 11 మందికి, తూర్పు గోదావరిలో 9 మందికి కరోనా వ్యాపించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: