ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.  ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు.   మహమ్మారిని అన్ని దేశాలూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.  

 

కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టింది.  కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  లాక్ డౌన్ సమయంలో ఎవరైన ఇబ్బందులు సృష్టిస్తే వారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి వేయాలని రోడ్రీగో ఆదేశాలు జారీ చేశారు.  కరోనా భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తుందని.. దీని భారిన పడుతూ ప్రాణాలు కోల్పోపోతున్నారని.. ఇలాంటి సమయంలో అందరూ లాక్ డౌన్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

 

దేశ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, వైద్య సిబ్బంది మీద దాడి చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.  ఈ మేరకు మిలిటరీ, పోలీసు సిబ్బందికి అధికారాలిస్తున్నట్లు వెల్లడించారు.  కాగా, గతంలో 2016లోకూడా రోడ్రీగో ఇలాంటి ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: