దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది శరీరాల్లో కరోనా మహమ్మారి దూరి ఉంది. 40 వేలకు పైగానే ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవించాయి. దీంతో ఈ కరోనా వైరస్ అప్పట్లో మహాభారతం లో ఉన్న బకాసురుడు తో పోలుస్తున్నారు. ఏకచక్ర పురం అనే గ్రామంలో బకాసురుడు అప్పట్లో నివసించేవాడు. బకాసురుడు ఆహారం మనుషులు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మనుషులు రోజుకొక లు వంతు చొప్పున రాక్షసుడైన బకాసురుడి తో ఒప్పందం కుదుర్చుకుంటారు. అదే టైంలో భీముడు వంతు రావటంతో నరరూప రాక్షసుడైన బకాసురుడి నీ అంతం చేస్తాడు.

 

ఇది మహాభారతంలో హైలెట్ సంఘటన. సరిగ్గా ఇప్పుడు ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా బకాసురుడి లాగా కరోనా వైరస్ చాలా మంది మనుషులను బలితీసుకుంది. ఇంకా తీసుకొంటుంది కూడా. బకాసురుడి లాగానే కేవలం మనుషుల్ని తప్ప వేరొక దాన్ని టచ్ చేయటం లేదు కరోనా వైరస్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మొదటి లో పరవాలేదనిపించినా గాని ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావటంతో ఏపీలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

 

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిమిష నిమిషానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో తెలుగు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కువగా పాజిటివ్ వస్తున్న వివరాలు చూస్తే ఢిల్లీ నిజాముద్దీన్ తో సంబంధం ఉన్నవాళ్ళు రావటంతో సామాన్య ప్రజలలో భయాందోళనలు మరీ ఎక్కువయ్యాయి. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ ప్రపంచంలో విరుచుకు పడటంతో లాక్ డౌన్ అమలులో ఉన్న దేశ ప్రజలకు భవిష్యత్తులో ఏ విధంగా జీవితాన్ని నెట్టుకు రావాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: