ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గంట గంటకు కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తుంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని సహా కొన్ని దేశాల్లో ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలించడం లేదు. మన దేశంలో కూడా కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2100 దాటింది. 

 

గత 24 గంటల్లో దాదాపు 350కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మన దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 50 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మొత్తం... 937,941 గా ఉంది. వీరిలో 47,273 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 195,188 మందికి కరోనా నయం అయింది. వీరిలో 659,708 మంది పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని తెలుస్తుంది. 

 

ఇక 35,772 (5%) మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో వృద్దులు ఎక్కువగా ఉన్నారు. మన దేశంలో కరోనా బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి రాష్ట్రాలకు కరోనా వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: