ప్రస్తుతం ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని తెలిస్తే మనమంతా అప్రమత్తమై వెంటనే దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి కాబట్టి. బంధువుల, కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్ సోకిందంటే తమ రక్తసంబంధీకులతో దూరంగా ఉండాల్సిందే. అయితే ఒకవేళ కరోనా సోకిన మీ బంధుమిత్రులు ఆ విషయం తెలియక మీతో కలిసి తిరిగి... మీకు కరోనా సోకేటట్లు చేస్తే... మీరేమంటారు? ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి అంటించలేదని తెలిస్తే లైట్ తీసుకుని చికిత్స చేయించుకుంటారు. కానీ ఇటలీ కి చెందిన ఒక వ్యక్తి తాను ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలు తనకు కరోనా అంటించిందనే అనుమానంతో చంపేశాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... పై ఫోటోలో కనిపిస్తున్న చూడ చక్కని జంట లో యువకుడి పేరు ఆంటోనియో డి పేస్... యువతి పేరు లారెనా క్వారంటా. వీరిద్దరూ ఇటలీ లోని సిసిలీ ప్రాంతానికి చెందినవారు. లారెనా క్వారంటా ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుండగా... అదే ఆసుపత్రిలో ఆంటోనియో నర్స్ గా పని చేస్తున్నాడు. ఇటలీ లో కరోనా మరణాల సంఖ్య 12 వేలు దాటింది అన్న సంగతి మనకు తెలిసిందే. దాంతో అక్కడి వైద్యులు నర్సులు ఎల్లవేళలా పనిచేస్తూ కరోనా పీడితుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ జంట కూడా కరోనా రోగులకు చికిత్స చేస్తూ విరామ సమయంలో కాసేపు మాట్లాడుకునేవారు.


ఓ వారం క్రితం... 'డార్లింగ్, నువ్వు ప్రజలను కాపాడడానికి చేస్తున్న కృషికి నేను ఫిదా అయిపోతున్నాను. నువ్వు నిజంగా గొప్పదానివి' అంటూ ఆమె ను పొగడ్తలతో ముంచెత్తాడు. కానీ ఇటీవల సదరు ప్రియుడు స్వల్ప అనారోగ్యానికి గురవ్వడంతో... తనకి కరోనా సోకిందని... అది ఖచ్చితంగా తన ప్రియురాలి నుండే వచ్చిందని బాగా అనుమానపడ్డాడు. అయితే నిన్న... నీతో ఓ విషయం మాట్లాడాలని ఆమెని పిలిచి.. నీ వల్లనే నాకు కరోనా సోకిందంటూ ఆమె గొంతు పిసికి కిరాతకంగా చంపేశాడు ఆంటోనియో. అనంతరం తన మణికట్టును ఒక పదునైన వైద్య పరికరంతో కోసుకున్నాడు.


ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఫోన్ చేసి తెలియపరిచాడు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆంటోనియో ని ఆస్పత్రికి తరలించి... లారెనా క్వారంటా మృతదేహాన్ని శవ పరీక్ష కొరకు పంపించారు. అయితే ఆమె మృతదేహం లో కరోనా వైరస్ ఆనవాళ్లే లేవని తేలింది. అలాగే అంటోనియో బాడీలో కూడా లో కరోనా నెగటివ్ అని వైద్య పరీక్షలలో తేలింది. ఏదేమైనా నిజమేంటో కూడా తెలుసుకోకుండా చాలా మంది ఆత్మహత్య లేదా హత్య లాంటి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: