అంతా బాగుంది. మమమంతా భద్రమే అని అనుకున్నంత సేపు పట్టలేదు. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు వెల్లువలా పెరిగిపోయాయి. ఇపుడు రెండు వేల కేసులతో భారత్ లో కరోనా దూకుడు మీద ఉంది. అయితే ఇది అసలు నంబర్ కాదా. భారత్ లాంటి 130 కోట్ల మంది ఉన్న దేశంలో కరోనా నంబర్ ఇంతకంటే చాలా ఎక్కువగా ఉందా.

 

ఉంటే ఆ నంబర్ ఎంత ఉంటుంది.  ఈ ప్రశ్నలకు ది గార్డియన్ అనే పత్రిక విస్త్రుతమైన కధనంలో జవాబులు ఎన్నో రాసింది. కరోనా కేసులు భారత్ లో తక్కువగా ఉన్నాయని అనుకోవద్దు. ఇది భారీ ఎత్తున పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయంటూ బాంబు పేల్చింది. దానికి గల కారణాలను కూడా చాలా తార్కికంగా పేర్కొంది.

 

భారత్ లో రెండు నెలల క్రితం తొలి కరొనా కేసు నమోదు అయితే ఇప్పటికి చేసిన పరీక్షలు గట్టిగా యాభై వేలను కూడా మించలేదని గార్డియన్ పత్రిక ఎత్తి చూపించింది. అంతే  కాదు. భారత్ లో ప్రజారోగ్యం కోసం మొత్తం జీడీపీలో ఖర్చు చేసేది కేవలం 1.3 శాతం మాత్రమేనని, ఇది సగటు ప్రపంచ ఆరోగ్య జీడిపీ కంటే చాలా చాలా తక్కువేనని చెబుతోంది. ఇలా వైద్య సదుపాయాల లేమి భారత్ ని పట్టిపీడిస్తోందని పేర్కొంది.

 


ఇక భారతలో ఇపుడు జన‌ సామూహిక సంక్రమణం దిశగా కరోనా వ్యాపిస్తోందని, అది ఢిల్లీ ప్రార్ధనల ద్వారా ఒక్కసారిగా పెరిగిన కేసుల బట్టి రుజువు అవుతోందని కూడా వెల్లడించింది. అలా ఒక్కసారిగా కేసులు పెరిగినవి ఈ మూడు రోజుల్లోనే వందల్లో ఉన్నాయంటే అసలు ఫిగర్ దేశంలో చాలా ఎక్కువగా భీభత్సంగా ఉంటుందని కూడా గార్డియన్ పత్రిక రాసుకొచ్చింది.

 

ఇక దేశంలో ఇప్పటికీ పరీక్షలు చేయని వారు 130 కోట్లలో ఎంతో మంది ఉన్నారని, ఏ పరీక్షలు లేకుండా కరోనా ప్రభావం లేదని ఎలా చెప్పగలుగుతారని కూడా ప్రశ్నించింది. ఇక ముంబైలోని మురికివాడలో కరోనా తొలి కేసు నమోదు కావడం అతి ప్రమాదకర సూచికగా వెల్లడించింది. అలా జన సామూహాల్లోకి కరోనా వెళ్ళిపోతే ఆ నంబర్ అమెరికా, ఇటలీతో పాటు ఇప్పటివరకూ ప్రపంచంలో ఎవరూ చూడనంత నంబర్ భారత్ చూస్తుందని కూడా గార్డినన్ రాసుకొచ్చింది. 

 

ఇదే విషయాన్ని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే దేశంలో కరోనా కేసులు బయటపడినవి గోరంత, ముందుంది అసలు కధ అంటున్నారు. మరి కేసులు పెరగకుండా లాక్ డౌన్ పాటించి అంతా క్రుషి చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. అదే కరోనాను అడ్డుకునే అసలైన ఆయుధంగా చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: