ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అల్ల కల్లోలు సృష్టిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ వైరస్ తో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా శర వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల్లో లాగే మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. ఇంటి నుండి బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఈ మహమ్మారి ప్రభావం మాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు.

 

తాజాగా భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కారకాలతో కోవిడ్-19 పరీక్షలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ల్యాబ్ లను గుర్తించారు. ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల యొక్క రాష్ట్రాల వారీగా జాబితాను విడుదల చేసింది.

 

అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలి, డామన్ & డియు, గోవా, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పాండిచేరి, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ప్రస్తుతం ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన నియమించబడిన ప్రయోగశాలలు లేని రాష్ట్రాలు ఇవి. 

 

దేశంలో ప్రస్తుతం డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి వాటి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్, అపోలో హాస్పిటల్స్ హైదర్ గూడ, హైదరాబాద్ (కాల్: 1860 500 4916, స్థానం) ఎస్‌ఆర్‌ఎల్ లిమిటెడ్, సికింద్రాబాద్ (కాల్: 1800 22 2000, స్థానం) ఎస్‌ఆర్‌ఎల్ లిమిటెడ్, సీఓ అంబికేర్ క్లినిక్స్ కొండపూర్ హైదరాబాద్ (కాల్: 040 4171 9999, స్థానం), మెడిక్స్ ల్యాబ్స్, న్యూ బోవెన్పల్లి, సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలను ఈ ఫోన్ నంబర్ లను సంప్రదించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోరారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: